రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన అమిత్ షా.!

SMTV Desk 2018-12-22 12:09:38  Rahul Gandhi, Amith Shah

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు. దేశ భద్రతపై ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ సహా పది దర్యాప్తు సంస్థలు ‘ఏ కంప్యూటర్‌లో స్టోర్ చేసిన, రిసీవ్ చేసుకున్న, పంపించిన, జనరేట్‌ అయిన సమాచారాన్నైనా అడ్డుకోవచ్చు, విశ్లేషించవచ్చు, పర్యవేక్షించొచ్చు అనేలా గురువారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

రాహుల్ విమర్శలపై బీజేపీ చీఫ్ అమిత్ షా మండిపడ్డారు. రాహుల్ అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. దేశ భద్రతపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశాస్త్రీయ నిఘా నియంత్రణకు గతంలో యూపీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మోదీ ఆ పనిచేస్తుంటే రాహుల్ ఓర్వ లేక కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.