జమ్మూకశ్మీర్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతం.!

SMTV Desk 2018-12-22 11:11:53  Indian Army, Terrorists Attack, Jammu Kashmir

జమ్మూకశ్మీర్, డిసెంబర్ 22: జమ్మూకశ్మీర్ లో పూల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఈరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతాబలగాలు ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. పూల్వామాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లుగా భద్రతాబలగాలకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందగా, రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసుల సంయుక్త బలగాలు త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిన ఇంటిని చుట్టుముట్టాయి. అయితే బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు, కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. (Six terrorists were on Saturday killed in an encounter with security forces in Jammu and Kashmir s Tral, Pulwama. Further, one of the militants killed includes Zakir Musa s top aid, Spliha Mohd which is a breakthrough for security forces in the valley.)అప్రమత్తమయిన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు నక్కిన ఇంటి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.