కరీంనగర్ లో రాష్ట్రపతి

SMTV Desk 2018-12-22 11:02:04  Indian presidant, Ramnath kovind, Karimnagar

కరీంనగర్, డిసెంబర్ 22: శుక్రవారం హైదరాబాద్ నగరానికి శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వచ్చారు. ప్రతి ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌లో గడుపుతారు. ఈసారి పర్యటనలో భాగంగా డిసెంబర్ 21 నుంచి 24 వరకు ఆయన ఇక్కడ ఉంటారు. అయితే నేడు కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రం, శివారులో అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తిచేశారు.

శనివారం ఉదయం 10.40 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నగునూర్ చేరుకోనున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి స్థానిక ప్రతిమ వైద్యకళాశాలకి చేరుకుంటారు. కళాశాలలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంతోపాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వైద్యవిద్యార్థులకు బంగారు పతకాలు, ప్రోత్సాహకాలను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, తెలంగాణ గవర్నర్ నరసింహన్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.