నగర రింగు రోడ్డుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2018-12-21 19:06:16  Hyderabad city, Regional ring road, TRS MP, Kalvakuntla kavitha

హైదరాబాద్, డిసెంబర్ 21: ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న రింగు రోడ్డు కల ఎట్టకేలకు నిర్మాణానికి కేంద్రం నుండి అంగీకారం లభించింది. నగరం చుట్టూ నాలుగు వరుసల్లో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని తెరాస ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తెరాస ఎంపీల విజ్ఞప్తి మేరకు భూసేకరణ ప్రారంభించుకోవచ్చని తెలంగాణ సర్కార్‌కు కేంద్రం సూచించింది. దీంతో సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌- గజ్వేల్‌- జగ్దేవ్‌పూర్‌-భువనగిరి-చౌటుప్పల్‌-ఇబ్రహీంపట్నం-చేవెళ్ల-శంకరపల్లి మీదుగా కంది వరకు ప్రతిపాదించిన రింగ్ రోడ్డు కల త్వరలో సాకారం కానుంది.




తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస ఎంపీలు ఈ నెల 18న కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సమావేశం నిర్వహించిన ఎంపీలు.. రింగ్ రోడ్డు ఆవశ్యకత, డీపీఆర్‌ను నేడు కేంద్ర మంత్రికి వివరించారు. దీంతో ఆయన సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు.