మరో రెండు జిల్లాలకు ఏర్పాట్లు

SMTV Desk 2018-12-21 18:54:17  Telangana state, TRS, New district formations

హైదరాబాద్, డిసెంబర్ 21: తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం 31 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం త్వరలో 33 జిల్లాలుగా మారబోతోంది. ములుగు, నారాయణపేట కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుకు అవ్సరమైన ప్రతిపాధనలు పంపాలని రెవెన్యూశాఖ భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్లను కోరింది.

ఈ రెండు కొత్త జిల్లాలతో పాటు రెండు కొత్త రెవెన్యూ డివిజన్లను, కొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మండలాలు:

1. నల్గొండ జిల్లాలో గట్టుప్పల్ మండలం
2. ములుగు జిల్లాలో మల్లంపల్లి
3. బాన్సువాడ నియోజకవర్గంలో చండూర్‌, మోస్రా
4. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఇనుగుర్తి
5. సిద్దిపేట జిల్లాలో నారాయణరావు పేట
6. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో వొక మండలం
7. ప్రస్తుతం జనగాం జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాకు బదలాయించబోతోంది.