వీఆర్వో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ సన్నాహాలు

SMTV Desk 2018-12-21 18:47:58  TSPSC, VRO Posts, Certificate verifications, 700posts, Vaani prasad

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) 700 వీఆర్వో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 16న రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకి 7.87 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ పరీక్షా ఫలితాలు, వాటిలో అత్యధిక మార్కులు సాధించిన మెరిట్ అభ్యర్ధుల జాబితాలను విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ, వొక్కో పోస్టుకు ముగ్గురిని చొప్పున ఎంపిక చేసి జనవరి 3వ తేదీ నుంచి వారి దృవపత్రాలను పరిశీలించబోతోంది. త్వరలోనే జిల్లాలువారీగా దృవపత్రాలను పరిశీలనకు షెడ్యూల్ ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ తెలియజేశారు. దీనికి సంబందించి పూర్తి వివరాలను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్ సైటులో చూడవచ్చునని ఆమె తెలిపారు.