వంచించి వెన్నుపోటు పొడిచారు అంటున్న వర్మ..!

SMTV Desk 2018-12-21 18:05:49  Ram Gopal Varma, Lakshmi's NTR, Vennupotu Song

హైదరాబాద్, డిసెంబర్ 21: క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నాడు, దానికి పోటీగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని ‘వెన్నుపోటు అనే పాటను ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఆ సాంగ్ కి సంబంధించిన వీడియోను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పాట రచయిత అయిన సిరాశ్రీకి, చిత్ర సంగీత దర్శకుడు, గాయకుడైన కల్యాణి మాలిక్ లకు తన ధన్యవాదాలు తెలియజేసారు. ‘దగ...దగా.. మోసం..నమ్మించి.. వెన్నుపోటు పొడిచారు. వంచించి..వంచించి వెన్నుపోటు పొడిచారు. కుట్ర..కుట్ర..కుట్ర.. అంటూ ఈ పాట కొనసాగింది. ఈ పాట వినపడుతుండగా ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి ఉన్న పలు పాత దృశ్యాలను వీడియో గా రూపొందించి జతచేసారు. ("Vennupotu" (backstab) from his movie "Lakshmi s NTR" on December 21st. His film narrates the life story of Late NT Rama Rao with focus on the former CM s later life. This biopic will narrate the incidents after Lakshmi Parvathi had entered in NTR s life).