కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ మంచిదే : బాబు

SMTV Desk 2018-12-21 17:51:57  Andrapradesh, Nara chandrababu naidu, Telangana CM, KCR, Return gifts, Assembly elections

అమరావతి, డిసెంబర్ 21: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకి వ్యతిరేఖంగా పోటీ చేసి ఘోరంగా పరాజయ పాలయిన చంద్రబాబు పై ముఖ్యమంత్రి కేసిఆర్ తన విజయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎపీ ఎన్నికల్లో తను బాబుకి వ్యతిరేఖంగా ప్రచారాల్లో పాల్గొని రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న విషయం తెలిసిందే. అయితే కేసిఆర్ అన్న మాటలకు బాబు తాజాగా స్పందించారు. దేశ ప్రజలను గందరగోళపర్చేందుకు గాను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పేరుతో కేసీఆర్ టూర్ చేయనున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం నాడు అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో రానన్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు. కొన్ని రాజకీయపార్టీలు కలిసి ఆడుతున్న గేమ్‌ గురించి ప్రజలకు వివరించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు వివరించారు. ఏపీలోని వైసీపీ, జనసేనతో పాటు కేసీఆర్, అసద్‌లపై బాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.[Chandrababu accpeting KCR Return gift on andhrapradesh assembly elections]



తెలంగాణలో తాను ప్రచారం నిర్వహించినందున తనకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని చేసిన వ్యాఖ్యలను బాబు గుర్తు చేశారు. కేసీఆర్ ఏపీకి వస్తే సంతోషమేనని ఆయన చెప్పారు. ఏ పార్టీ ఏ పార్టీతో కుమ్మక్కయ్యాయో ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని బాబు తెలిపారు. దేశంలో ప్రజలను గందరగోళపర్చేందుకు కేసీఆర్ పర్యటిస్తున్నారని బాబు ఆరోపించారు. బీజేపీకి అనుకూలమైన ఫ్రంట్‌లు కూడ దేశంలో ఏర్పడే అవకాశం ఉందన్నారు. పరోక్షంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ‌పై బాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈవీఏంలపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ సందర్భంగా ఓట్లు ఎలా పెరిగాయని బాబు ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్నాయని బాబు అభిప్రాయపడ్డారు. తాము ఎవరికీ ఓటు వేశామో తెలుసుకొనే హక్కు అందరికీ ఉంటుందన్నారు.