ఇక ప్రతి కంప్యూటర్‌పైనా ప్రభుత్వ నిఘా!

SMTV Desk 2018-12-21 15:57:41  Union Home Ministry, Central agencies, CBI, Cabinet Secrateriate

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఇప్పటి నుంచి మన దేశంలోని ప్రతి కంప్యూటర్‌ మీద ప్రభుత్వ నిఘా కొనసాగనుంది. ఏ సమయంలో అయిన, ఏ కంప్యూటర్లో అయిన ప్రవేశించేందుకు దర్యాప్తు సంస్థలకు కేంద్రం అధికారాలు కట్టబెట్టింది. దీనికి సంబందించిన ఆదేశాలపై కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. ‘‘ఏ కంప్యూటర్‌లో స్టోర్ చేసిన, రిసీవ్ చేసుకున్న, పంపించిన, జనరేట్‌ అయిన సమాచారాన్నైనా దర్యాప్తు సంస్థలు అడ్డుకోవచ్చు, విశ్లేషించవచ్చు, పర్యవేక్షించొచ్చు... అంటూ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ సెక్ష‌న్ 69(1) చట్టం కింద ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

ప్రభుత్వం నుంచి ఈ అధికారాలను ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్‌, ఈడీ‌, సీబీఐ‌, డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, ఎన్ఐఏ, క్యాబినెట్ సెక్ర‌ట‌రియేట్‌, డైర‌క్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్, ఆర్ అండ్ ఏడ‌బ్ల్యూ, ఢిల్లీ పోలీస్ తదితర సంస్థలు ఉన్నాయి. కంప్యూటర్‌కు సంబంధించిన వ్యక్తులు సదరు విచారణ సంస్థలకు అన్ని విధాలా సహకరించాల్సి ఉంటుంది. సహకరించని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంది.