ముంబైలోని జిన్నా హౌస్ మాదే అంటున్న పాక్..!

SMTV Desk 2018-12-21 11:41:59  Jinnah House, Mumbai, Pakistan, India

ముంబై, డిసెంబర్ 21: ముంబైలోని అతి ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న జిన్నాహౌస్ తమదేనని, దానిపై భారత్‌కు ఎలాంటి అధికారాలు లేవని పాకిస్థాన్ పేర్కొంది. భారత విదేశంగ మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. జిన్నాహౌస్‌ను భారత విదేశీ మంత్రిత్వశాఖకు బదిలీ చేసే ప్రయత్నాలుజరుగుతున్నాయి అని చెప్పారు. మంత్రి సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ స్పందించింది. జిన్నా హౌస్ తమదేనని, దానిని మరొకరు స్వాధీనం చేసుకోవడానికి అంగీకరించబోమని పేర్కొంది. గతంలో జిన్నాహౌస్ పాకిస్థాన్‌దేనని భారత ప్రభుత్వం స్వయంగా వొప్పుకుందని, అందుకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని పాకిస్థాన్ పేర్కొంది.

సముద్రం వొడ్డును నిర్మించిన ఈ బంగ్లాలో 1930 వరకు పాకిస్థాన్ ఫౌండర్ మహ్మద్ అలీ జిన్నా నివసించేవారు. జిన్నా తమవాడని, అందువల్ల ఆ బంగ్లాను తమ పేరుపై బదిలీ చేయాలని కొన్నాళ్లుగా పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది. తాజాగా, భారత విదేశంగ మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. జిన్నా హౌస్‌ను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేరుపై బదిలీ చేసే ప్రయత్నాలు ప్రారంభమైనట్టు తెలిపారు. దీంతో పాక్ ఈ మేరకు స్పందించింది.