భారత మహిళల క్రికెట్ జట్టుకు కొత్త కోచ్..?

SMTV Desk 2018-12-20 20:41:01  Indian womens criket team,Gari kirsten New coach, BCCI, Ramesh povar, Kapil dev, Anshuman gaikwad,Shantha rangaswamy, Venkatesh prasad, Manoj prabhakar, Trent jansiston

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ గా ఉన్నరమేశ్ పొవార్ పదవీ కాలం ముగియడంతో బీసీసీఐ కొత్త కోచ్‌ ఎంపికను ప్రారంభించింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానించింది.
వచ్చిన దరఖాస్తుల నుంచి కొత్త కోచ్‌ను ఎంపిక చేయడానికి మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి సభ్యులుగా కమిటీని నియమించింది. ఈ కమిటీ బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన 28 మందిని ఇంటర్య్వూ చేసింది.

వారిలో వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, ట్రెంట్ జాన్స్‌స్టన్, దిమిత్ర మస్కరెన్షా, బ్రాడ్ హగ్, కల్పనా వెంకటాచర్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరిలో ముగ్గురిని వ్యక్తిగతంగా, కిర్‌స్టన్ సహా ఐదుగురిని స్కైప్ ద్వారా, వొకరిని ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసినట్లు బీసీసీఐ తెలిపింది.

సుధీర్ఘ వడపోత తర్వాత గ్యారీ కిర్‌స్టెన్, డబ్ల్యూ వీ రామన్ పేర్లను బీసీసీఐకి అందజేసింది. వీరిద్దరిలో గ్యారీ కిర్‌స్టన్‌కు అవకాశాలు మెండుగా ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ భారత్ నెగ్గడం వెనుక ఆయన కృషి చాలా ఉంది.

2008-11 మధ్య టీమిండియా పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహారించిన ఆయన ఆ తర్వాత కుటుంబంతో గడపాలనే ఉద్దేశ్యంతో తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. 2011 నుంచి 2013 వరకు సౌతాఫ్రికా జట్టుకు కోచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్‌గా పనిచేస్తున్నారు.