గోవాలో విదేశిరాలుపై విరుచుకుపడ్డ దుండగులు

SMTV Desk 2018-12-20 20:40:16  Goa, Britian women, Gang rape, Police

గోవ, డిసెంబర్ 20: భారత దేశ ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోవాలో 48ఏళ్ల బ్రిటిష్ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బ్రిటిష్ మహిళ సౌత్ గోవాలోని పలోలెమ్ బీచ్ సందర్శనకు వచ్చింది. అనంతరం తాను బస చేసిన కనకోనా ప్రాంతానికి చేరుకునేందుకు స్థానిక రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి అడ్డగించి దాడికి దిగాడు.

లైంగిక దాడికి పాల్పడిన తర్వాత తన దగ్గరున్న వ్యాలట్, ఇతరత్రాలను దోచుకుని పారిపోయినట్లు తెలిపింది. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.