నాగబాబు పై 'కత్తి'

SMTV Desk 2018-12-20 20:07:38  Kathi Mahesh, Nagababu, Balayya Controversy,Mega Fans,Nandamuri Fans

హైదరాబాద్, డిసెంబర్ 20 :ఇటీవల జరిగిన వొక ఇంటర్వ్యూలో చిరంజీవి తమ్ముడు నాగబాబు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అని అన్నాడు, అప్పుడు యాంకర్ నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదా ? అని అడుగగా ,వెంటనే తేరుకుని వల్లూరి బాలకృష్ణ గొప్ప హాస్య నటుడు ఆయనని మర్చిపోయనేంటి అని సమాధానం ఇచ్చారు. దాంతో సామజిక మాధ్యమాల్లో పెద్ద దుమారమే రేగింది. ఆ తరువాత సారీ చెప్పే నెపంతో బాలకృష్ణ మంచి నటుడు , పెద్ద కమెడియన్ , బాగా కామెడీ చేస్తాడు అని చేపి పాత తరం నటుడు అంజి బాబు ఫోటో ని చూపించాడు . దీనితో ఇప్పటివరకు వొక స్థాయి వరకే ఉన్న గొడవలకి ఆజ్యం పోసినట్లుంది.

ఇదిలా ఉంటే తాజాగా క్రిటిక్ కత్తి మహేష్ ఈ విషయం మీద తనదైన శైలిలో స్పందించాడు " బాలకృష్ణ ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అన్నాడు అది తప్పే , అందుకని ఇప్పుడొచ్చి తన తోటి నటుడిని ఎవరో తెలియదనడం ఎంత వరకు కరెక్ట్ ? 40పైగా సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న బాలకృష్ణ తెలియదంటే , ఆయనకి వాళ్ళ అన్న కూడా తెలియదనుకుంట , అయినా వొక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడిని విమర్శించడం మాములే , బాలకృష్ణ కామెంట్స్ కి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడం వొక పద్ధతి , కానీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని నాగబాబు ఎప్పుడో సర్దుమణిగిన ఈ కాంట్రావెర్సీ ని ఇప్పుడు మళ్ళీ తెరమీదకి తీసుకురావడం , ఆయన ఐడెంటిటీ క్రైసిస్ ని మరొక సారి తెలియచెపుతోంది . ఇరువర్గాల ఫాన్స్ " ఆర్ ఆర్ ఆర్ " సినిమా తో వొక్కటవుతన్న ఈ శుభసమయంలో ఇలాంటి చీప్ కాంట్రవర్సిలు రేపి గుర్తింపు పొందాలని చూస్తున్నాడని , బహుశా పవన్ కళ్యాణ్ దృష్టిలో పడి పార్టీ టికెట్ పొందాలని చూస్తున్నాడెమో " అని సందేహం వ్యక్తం చేసాడు.

బాలకృష్ణ ఫాన్స్ దీనిని మీరు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని , అనవసరం గా రియాక్ట్ అయ్యి ఆ జబర్దస్త్ కమెడియన్ ని హీరో చెయ్యొద్దని హితవు పలికాడు .