కేజ్రీవాల్ కు లాయరుగా తప్పుకున్న జెఠ్మలానీ

SMTV Desk 2017-07-26 18:19:26   Ram jethmalani, Quit, KEJRIWAL, CASE

న్యూఢిల్లీ, జూలై 26 : ప్రముఖ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కు లాయరుగా తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. విచారణ సమయంలో కేంద్రమంత్రి జైట్లీపై అభ్యంతరకర పదాలు ఉపయోగించమని న్యాయవాది జెఠ్మలానీకి తానేమీ సూచించలేదని సీఎం కేజ్రీవాల్‌ న్యాయస్థానానికి వెల్లడించిన మరుసటి రోజే జెఠ్మలానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘నేను కేజ్రీవాల్‌ లాయరుగా తప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పారు. నాకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని న్యాయస్థానానికి చెప్పారు. కానీ ఆయనే అలా మాట్లాడమన్నారు," అని జెఠ్మలానీ తెలిపారు. తనకు రావాల్సిన మిగతా ఫీజు రూ.2కోట్లు కూడా వెంటనే చెల్లించాల్సిందిగా జెఠ్మలానీ సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. నిజాయతీ లేని వ్యక్తి అని అర్థం వచ్చే విధంగా జెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలపై జైట్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.