'యన్.టి.ఆర్' నుండి ఈ పోస్టర్ ప్రత్యేకం

SMTV Desk 2018-12-20 16:55:16  krish,Nbk,Ntr,Ntrbiopic,Sharath Santosh, Mohana Bhogaraju, M.M. Keeravaani, Kaala Bhairava, Sreenidhi Tirumala . Shivadatta, Dr. K. Ramakrishna, M.M. Keeravaani ,Sanskrit Verses From Aadishankara, Nirvana Shatkam, G.Jeevan Babu Shehnai, Ballesh,

హైదరాబాద్, డిసెంబర్ 20 : నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం " యన్.టి.ఆర్ ". ఈ చిత్ర ఆడియో విడుదల రేపు సాయంత్రం 5 గంటలకి నిర్ణయించారు . కాగా ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలతో సహా, పలు పోస్టర్లు విడుదలయి ఔరా అనిపిస్తున్నాయి .

తాజాగా యన్.టి.ఆర్ గారు ఆయన భార్య బసవతారకంతో ఉన్న సీన్ లోని పోస్టర్ వొకటి విడుదల చేసారు . బాలకృష్ణ తల్లి అయినా బసవతారకం గారి పాత్రలో విద్యా బాలన్ హార్మోనియం వాయిస్తుండగా యాన్.టీ.ఆర్ పాత్రలోని బాలకృష్ణ ఆమెను తదేకంగా చూస్తున్నారు. ఇప్పటివరకు విడుదలయిన పోస్టర్లకన్నా ఇది ప్రత్యేకం.