చర్చించేందుకు ఇది సరైన సమయం కాదు : మమత

SMTV Desk 2018-12-20 14:19:55  Mamatha benarjee, Rahul gandhi, Trinamool congress party, DMK Party, Stalin

కోల్‌కతా, డిసెంబర్ 20: నగర సచివాలయంలోని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఇంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ మోడిని ఎదుర్కొనే సత్తా రాహుల్‌ గాంధీకి వుంది అని చేసిన వాఖ్యలపై స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. కూటమి తరపున ప్రధాన మంత్రి అభ్యర్థిని నిర్ణయిందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు. కూటమిలో అందరం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం మేరకు ప్రధాని అభ్యర్థిని నిర్ణయించాలి. ఆ విషయం గురించి చర్చించేందుకు ఇది సరైన సమయం కాదు. ఏది ఏమైనా భవిష్యత్‌లో చక్కటి మార్పు వస్తుందని ఆశిస్తున్నాంగగ అని అన్నారు.