"డ్రగ్స్ కేసులో పూరీపై బండ్ల గణేష్ స్పందన"

SMTV Desk 2017-07-26 17:39:20  bandla ganesh, puri jagannath, drugs, varuntej, mahesh, prabhas

హైదరాబాద్ , జూలై 26 : తెలుగు సినిమా చలనచిత్ర నటుడు బండ్ల గణేష్ 2009 లో టాలీవుడ్ నిర్మాత గా మారారు. ఆర్ట్ ప్రొడక్షన్స్ క్రింద ఆంజనేయుల చిత్రంతో అయన ప్రొడక్షన్ మొదలుపెట్టారు. గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో జరుగుతున్న డ్రగ్స్ వ్యవహారం పై ఈ రోజు గణేష్ స్పందించారు. దర్శకుడు పూరికి ఆయన సపోర్టు చేయడం విశేషం. తాజాగా బండ్ల గణేష్ మీడియా తో మాట్లాడుతూ...పూరి తనకి చాలా సంవత్సరాలుగా తెలుసని, తను చాల మంచి వ్యక్తి అని తెలిపారు. డ్రగ్స్ ఆరోపణలతో ఆయనకు సినిమాల మీద ఏకాగ్రత నశిస్తుంది. ఈ ఆరోపణల నుండి పూరీ ముత్యంలా బయటపడి ఓ మంచి హిట్ ను అందిస్తాడన్న నమ్మకం తనకుందన్నారు గణేష్. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పూరీని సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ లిస్టులో నిర్మాత బండ్ల గణేష్ కూడా చేరిపోయాడు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సపోర్టు కూడా పూరీకి ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పుడు స్టార్స్ గా ఉన్న మహేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్ టీఆర్.. అందరికి పూరి హిట్స్ ఇచ్చాడు. వారిని డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు. ఆ అభిమానంతో స్టార్స్ అంతా పూరిని సపోర్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. పూరీ జగన్నాధ్‌తో బండ్ల గణేష్ ఇప్పటికే ఇద్దరమ్మాయిలతో, టెంపర్ లాంటి హిట్ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. మరి ఈ డ్రగ్స్ కేసు నుండి పూరి నిజంగానే ముత్యంలా బయటపడతారేమో వేచి చూడాలి.