30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు తీసిన 13ఏళ్ల బాలుడు

SMTV Desk 2018-12-19 20:13:39  Cyber crimes, Social media, Nude videos, Hostel girls

హైదరాబాద్‌ సిటీ/మాదాపూర్‌, డిసెంబరు 19: నగర మాదాపూర్ ఏరియాలోని వొక మహిళల హాస్టల్ లోని యువతులు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు ఓ బాలుడు. అతని చర్యను చివరికి ఓ మహిళ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుణ్ని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిఽధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని వొక వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో 70 మంది మహిళలు ఉంటున్నారు. ఆ హాస్టల్‌ను ఆనుకొని ఆనంద్‌యాదవ్‌ అనే వ్యక్తి ఇళ్లు ఉంది. హాస్టల్లోని బాత్‌రూం.. అతని ఇంటి కిటికీ సమీపంలో ఉంది.

కాగా స్థానిక ప్రైవేటు స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అతని కుమారుడు ఆ కిటికీలోనుంచి కొద్ది రోజులుగా.. హాస్టల్లోని మహిళలు స్నానం చేస్తున్న సమయంలో ట్యాబ్‌తో ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్నాడు. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఓ యువతి స్నానం చేస్తుండగా.. వొక్కసారిగా లైట్‌ ఫ్లాష్‌ అయింది. ఆమె దీనిని గమనించి చూడగా బాలుడు వీడియో తీస్తున్న విషయం అర్థమైంది. దీంతో షాక్‌కు గురైన యువతి ఈ విషయాన్ని హాస్టల్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లింది. వారి సహకారంతో బాలుణ్ని గుర్తించారు. అనంతరం హాస్టల్లో ఉండే 20 మంది యువతులు మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 354సీ వయోరిజం సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. బాలుణ్ని, అతని తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వందల సంఖ్యలో వీడియోలు.!

స్నానాల దృశ్యాలను బాలుడు కొన్ని వందల సార్లు చిత్రీకరించి ఉండవచ్చని బాధితులు పోలీసులకు తెలిపారు. అంతేకాదు.. అతడు ఆ దృశ్యాలను తన ఇద్దరు స్నేహితులకు కూడా పంపించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అయితే కొన్ని వీడియోలకు పర్సనల్‌ కోడ్‌ ఉండటంతో అవి ఓపెన్‌ కాకవడంలేదని, సదరు బాలుడు దాని పాస్‌వర్డ్‌ మరిచిపోవడంతో ట్యాబ్‌లోని వీడియోలను ఓపెన్‌ చేయడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. దాంతో ట్యాబ్‌ను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించామన్నారు