సుమారు 17 గ్రహశకలాలపై నీటి ఆనవాళ్లు

SMTV Desk 2018-12-19 20:07:43  Solar system ,Universe, Planet earth, Japan, Astronomical society of japan jarnal

టోక్యో, డిసెంబర్ 19: విశ్వంలో భూగ్రహం పైనే కాకుండా ఇంకా ఎక్కడైనా నీళ్ళ ఆనవాళ్ళు ఉన్నాయా అని అనేక పరిశోధనలు జరుగూతూనే వున్నాయి. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు. సుమారు 17 గ్రహశకలాలపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు తేల్చారు. అకారి ఉపగ్రహం అందించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని వారు తెలిపారు. ఇన్‌ఫ్రా రెడ్ కెమెరాల ఆధారంగా .. గ్రహశకలాల అధ్యయనం జరిగింది. అయితే గ్రహశకలాలు నీటిని పీల్చుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ జపాన్ జర్నల్‌లో ఈ విషయాన్ని పబ్లిష్ చేశారు. సౌర కుటుంబంలో ఎక్కడెక్కడ నీరుందన్న విషయం మరింత స్పష్టమైనట్లు సైంటిస్టులు తెలిపారు.