యువీకి నిరాశేనా...?

SMTV Desk 2018-12-18 19:59:11  2019 IPL, Cricket players Selections, First round, Yuvaraj singh

జైపూర్, డిసెంబర్ 18: 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ వేలానికి సిద్దమవుతుంది. దీనికోసం ఆటగాళ్ళ వేలం ఈ రోజు జైపూర్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేలంలో టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌కు నిరాశ మిగిల్చింది. యువరాజ్ సింగ్ పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. జైపూర్ లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. గతేడాది యువరాజ్ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ఆడాడు. ఆశించిన మేరకు రాణించకపోవడంతో విడుదల చేశారు.

సందిగ్ధంలో ఉన్న యువీ తన కనీస ధరను రూ.2 కోట్ల నుంచి కోటికి తగ్గించుకున్నాడు. తార స్థాయిలో ఉన్నప్పుడు అతడు రూ.16 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. వొకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరుపులు మెరిపించిన యువరాజ్.. ఇప్పుడు ఫామ్‌లేమీతో ఇబ్బందిపడుతున్నాడు. యువరాజ్ సింగ్ తోపాటు ఛెతేశ్వర్‌ పుజారా, గప్టిల్, బ్రెండన్‌ మెక్ కల్లమ్, అలెక్స్‌ హేల్స్‌ లను కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.