‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ లుక్ ఇదేనా?

SMTV Desk 2018-12-18 18:48:34  Ramcharan, Jr.NTR, S S Rajamouli, R R R

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ద‌ర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఓ మల్టీస్టారర్ .. చిత్రం చేయ‌బోతున్నాన‌ని ప్రక‌టించ‌గానే సినిమా ప్రారంభం కాక ముందు నుంచే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని నంద‌మూరి అభిమానులు, మెగాభిమానులు ఆస‌క్తితో ఎదురుచూస్తున్న తరుణంలో.. సినిమా ప్రారంభం అవ్వడం, ఫస్ట్ షెడ్యూల్ పూర్తవడం జరిగిపోయాయి.

‘ఆర్ఆర్ఆర్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలా కనిపిస్తారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన భార్య, ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలు నెట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఆర్ఆర్ఆర్‌లో యంగ్‌టైగర్ లుక్ ఇదేనంటూ నెటిజన్లు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.