ఎన్ఆర్ఐ ఓట్లపై దృష్టి పెట్టిన రాహుల్

SMTV Desk 2018-12-18 18:45:23  Rahul gandhi, Congress party, NRI Voters

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18: ప్రముఖ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తాజాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆ పార్టీ ఎన్ఆర్ఐ ఓట్లపైన కూడా దృష్టి పెట్టింది. అందుకే ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మరోసారి పశ్చిమ ఆసియా దేశాల్లో పర్యటించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే జనవరి 11,12 తేదీల్లో రెండ్రోజుల పర్యటన కోసం అబుదాబి, దుబాయ్ లకు వెళ్లనున్నారు. కొత్త సంవత్సరంలో ఇది ఆయనకు మొదటి టూర్ . దీన్ని శ్యామ్ పిట్రాడో ఆధ్వర్యంలోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహిస్తోంది. రాహుల్ ఈ టూర్ లో ఎన్ఆర్ఐ ల బహిరంగ సభల్లో పాల్గోనున్నారు.

అబుదాబి, దుబాయ్ ఏదో వొక సిటీలో ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ ఇండోర్ స్టేడియం బుక్ చేయాలని భావిస్తోంది. మూడు రాష్ట్రాల విజయాన్ని ఆ దేశాల్లో ఉండే కాంగ్రెస్ శ్రేణులతో పంచుకోవాలని ఈ ఏర్పాట్లు చేసింది. ఎంతమంది వస్తారో చెప్పలేము గానీ, అయితే... వీలైనంత మంది రాహుల్ సభల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. మూడు రాష్ట్రాల విజయం తర్వాత చాలా మంది కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు రాహుల్ సభల్లో పాల్గొనాలనే ఉత్సుకతతో ఉన్నారని తెలిపారు. రాహుల్ టూర్ ను అక్టోబర్ లోనే ప్లాన్ చేసినా....కొన్ని కారణాలవల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.