పవన్ ప్రసంగంపై స్పందించిన రామ్ చరణ్.!

SMTV Desk 2018-12-18 16:49:20  Pavan kalyan, Ram Charan Tej

హైదరాబాద్, డిసెంబర్ 18: జనసేన ప్రవాస గర్జనలో భాగంగా ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డల్లాస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి భారీగా జనం తరలివచ్చారు. వేదికపై పవన్ మాట్లాడుతూ ఉద్వేగ పూరిత వ్యాఖ్యలు చేసారు. ‘నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు.. రోజూ భయాన్ని ఎదుర్కోవటమే అని అన్నారు. కాగా పవన్ మాటలపై సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

‘‘ప్రతీ రోజు భయాన్ని అధిగమిస్తూ ముందుకు సాగాలి. భయంలోని మార్పును ఎదుర్కోలేకపోవటమే పెద్ద భయం. ఇప్పటి వరకు నేను విన్న ది బెస్ట్ ప్రేరణాత్మక ప్రసంగం ఇదే, ది మాన్, ది లీడర్, ది విసనరీ..పవన్ కళ్యాణ్ అని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్‌ పెట్టారు. దీంతో.. పవన్ ప్రసంగం నింపిన ఉత్సాహం, దానిపై రామ్ చరణ్ స్పందన చూసి జనసైనికులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.