ప్రత్యేకహోదా అమలు చేయడం కుదరదన్న కేంద్రం..!

SMTV Desk 2018-12-18 15:13:53  MP Ravindra Kumar, TDP, BJP, Special status Issue

అమరావతి, డిసెంబర్ 18: ఏపీకి ప్రత్యేకహోదా కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే, తాజాగా ఈ విషయంపై పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 14వ ఆర్థిక సంఘ నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదాను దేశంలో అమలు చేయడం కుదరదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించామని కేంద్రం తెలిపింది.విదేశీ సంస్థల ద్వారా ఏపీ నిర్మాణానికి సాయం చేస్తున్నట్లు వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు జవాబు ఇచ్చింది.