మణికర్ణిక ట్రైలర్

SMTV Desk 2018-12-18 14:53:37  Manikarnika,The Queen Of Jhansi,Kangana Ranaut,krish , zee studios

ముంబై , డిసెంబర్ 18 :మన భారతీయ చరిత్రలో వీరలకి కొదవులేదు , వారి వీర గాధలతో వచ్చిన సినిమాలకి తిరుగులేదు . అలాంటి వీరగాధలని ఆదరించి అక్కున చేర్చుకోవడలో మన భారత జాతి వొక అడుగు ముందే ఉంటుంది . ఇప్పటికి అలాంటి సినిమాలు చాలా వచ్చాయి . తాజాగా ఆ కోవలోనే వీర నారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవితం ఆధారంగా " మణికర్ణిక " రూపొందుతోంది.


విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ,క్రిష్ జాగర్లమూడి కొంత భాగాన్ని తెరకెక్కించగా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు , ఆ తరువాత లక్ష్మీ భాయ్ పాత్రను పోషిస్తున్న కంగనా రనౌత్ తానే స్వయంగా దర్శకత్వం వహించింది . జీ స్టూడియోస్ , కమల్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ని ఈ రోజు విడుదల చేశారు . ఇదివరకు చారిత్రాత్మక గాథను తెరకెక్కించిన క్రిష్ దర్శక శైలి ని ఈ ట్రైలర్ లో మనం గమనించవచ్చు . వివిధ దేశ భక్తి ,యాక్షన్ ,సెంటిమెంట్ ఘట్టాలతో మొత్తం మీద ట్రైలర్ అద్భుతంగా ఉంది.