కోడలికి నరకం చూపించిన అత్తా మామలు

SMTV Desk 2018-12-18 14:17:51  Uttarpradesh, Facebook, Nude pics, Woman harrasements

ఉత్తరప్రదేశ్‌, డిసెంబర్ 18: నగరంలో వొక వింత సంఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా చూసుకూవాల్సిన అత్తా మామలే తన పాలిట శాపంగా మారారు. పోలీసుల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చెప్పుల షాపు నడిపే వ్యక్తి మరణించడంతో అతడి భార్య అత్తమామల దగ్గరే వుంటోంది. ఈ క్రమంలో తన భర్తకు సంబంధించిన బ్యాంకు వివరాలతో పాటు ఆస్తి వ్యవహారాలను తనకు ఇవ్వాల్సిందిగా కోడలు అడిగింది. అంతే... ఆమెను ఇంటి నుంచి ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు అత్తామామలు.

ఆమె ఫోటోలను తీసుకుని వాటికి మార్ఫింగ్ చేసి దుస్తులు లేకుండా చేశారు. ఆ ఫోటోలను నెట్లో పెట్టి బజారున పడేశారు. ఈ దారుణం తన దృష్టికి రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.