వందేమాతర గేయాన్ని ఆలపించాల్సిందే: మద్రాస్ హైకోర్టు

SMTV Desk 2017-07-26 15:44:26  VANDHEMATHARAM NATIONAL SONG, THAMILANADU, SCHOOLS, PRIVETE

చెన్నై, జూలై 26 : తమిళనాడులోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల కార్యాలయాల్లో వందేమాతర గేయం తప్పనిసరిగా ఆలపించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశిస్తూ మంగళవారం ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంవీ మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దేశభక్తి అనేది దేశంలోని ప్రతిఒక్క పౌరుడి కనీసం ధర్మంగా వారానికి రెండు రోజులైనా స్కూళ్లలో వందేమాతరాన్ని పాడిపించాలని సోమ, శుక్ర వారాల్లో జాతీయ గేయాన్ని విద్యార్ధులతో ఆలపించాలని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కోర్టు సూచించింది. అలాగే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నెలకు ఒకసారైనా వందేమాతర గేయాన్ని ఆలపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక వేళ బెంగాలీ, సంస్కృతంలో వందేమాతరాన్ని ఆలపించడం ప్రజలకు కష్టమైతే, తమిళంలోకి అనువాదం చేసేందుకు చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.