బిజేపి ఏడాది ఆదాయం @1000 కోట్లు

SMTV Desk 2018-12-18 13:26:00  BJP, Party annual income

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18: భారత దేశ కేంద్ర అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీ ఆదాయం వివరాలు, విరాళాల రూపంలో రాజకీయ పార్టీలకు వచ్చిన నిధుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్స్మ్ సంస్థ వెల్లడించింది. అలాగే రాజకీయ పార్టీల ఆదాయ వివరాలతో పాటు ఖర్చు వివరాలను కూడా బయటపెట్టింది. 2017-18 ఏడాదికిగాను బీజేపీ ఆదాయం రూ.1,027.339 కోట్లుగా తేలింది. ఇక బీజేపీ ఖర్చు చేసిన మొత్తం రూ.750 కోట్లు. తాజా లెక్కలతో దేశంలో అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ నిలిచింది. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీజేపీ ఆదాయం రూ.7కోట్లు తగ్గడం విశేషం. గతేడాది బీజేపీకి అందిన నిధులు రూ.1,034.27 కోట్లు. మరో జాతీయ పార్టీ సీపీఎం రూ.104.847 కోట్ల విరాళాలతో బీజేపీ తర్వాతి స్థానంలో ఉంది. మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి రూ.51.694 కోట్ల విరాళాలు అందాయి. కాగా కాంగ్రెస్ పార్టీ ఆదాయ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది పార్టీ ఆదాయానికి సంబంధించిన వివరాలను కాంగ్రెస్ పార్టీ ఇంకా వెల్లడించలేదు. గతేడాది కాంగ్రెస్ పార్టీ ఆదాయం రూ.225.36కోట్లుగా ఉంది. అన్ని పార్టీలు అక్టోబర్ 30వ తేదీ లోపు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ఇంకా ఆ పని చేయకపోవడం గమనార్హం.

2017-18..

పార్టీ ఆదాయం ఖర్చు
బీజేపీ రూ.1027.339కోట్లు రూ.758.47కోట్లు
సీపీఎం రూ.104.847కోట్లు రూ.83.482కోట్లు
బీఎస్పీ రూ.51.694కోట్లు రూ.14.78కోట్లు
ఎన్సీపీ రూ.8.15కోట్లు రూ.8.84కోట్లు
టీఎంసీ రూ.5.167కోట్లు
సీపీఐ రూ.1.55కోట్లు