'లక్ష్మీస్ యన్ టీ ఆర్ ' కథ కి కారణం అదే : వర్మ

SMTV Desk 2018-12-18 12:24:18  ntr,lakshmis ntr,rgv,ramgopal varma,tollywood

హైదరాబాద్ డిసెంబర్ 18 :ఓ వైపున దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా రూపొందిస్తుండగా , మరో వైపున ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తరువాత నడిచిన కథను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ వొక సినిమా తెరకెక్కిస్తున్నాడు . తాజాగా వొక ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి ఆయన ప్రస్తావించారు.

"అప్పట్లో ఎన్టీఆర్ పెద్ద స్టార్ , ఎంతో పాప్యులర్. లక్ష్మీపార్వతి ఓ సాధారణ మహిళ పెద్ద అందగత్తె కూడా కాదు. అలాంటి ఆమె ఎన్టీఆర్ కి ఎలా చేరువైంది? ఇదే నాకు ఎదురైన పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న నుంచే నా పరిశోధన మొదలైంది .. ఆ పరిశోధన ఆధారంగానే ఈ సినిమా రానుంది.

క్రిష్ రూపొందిస్తోన్న కథానాయకుడు లో ఎన్టీఆర్ సినీ జీవితం .. మహానాయకుడు లో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ఉంటాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఈ సినిమాలో చూడొచ్చు" అని ఆయన చెప్పుకొచ్చారు.