'118' టీజర్ రివ్యూ

SMTV Desk 2018-12-18 11:52:29   kalyan ram, nandamuri, nkr, tdp, tollywood,118 teaser,patas

హైదరాబాద్ డిసెంబర్ 18 : హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ,ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో "118" సినిమా చేస్తున్నాడు , ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు . ఈ చిత్రంలో నివేతా థామస్ , షాలిని పాండే హీరోయిన్లగా నటిస్తున్నారు . ఇప్పటికే ఆ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చెయ్యగా మంచి స్పందన వచ్చింది కాగా ఈ రోజు ఆ సినిమా టీజర్ ని విడుదల చేశారు . ఈ టీజర్ లో కళ్యాణ్ రామ్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది .


చూస్తుంటే ఇదేదో త్రిల్లర్ సినిమాలాగా ఉంది 0:49 సెకెన్ల నిడివి ఉన్న ఈ టీజర్ లో చాలా విశేషాలున్నాయి. ప్రతి ఫ్రేమ్ అందంగానే కాకుండా, ఉత్కంఠను కూడా రేకెత్తించడం లో డైరెక్టర్ కేవీ గుహన్ సక్సెస్ అయ్యాడు . టీజర్ లో ఉన్న లొకేషన్స్ విభిన్నంగా ఉన్నాయి , కళ్యాణ్ రామ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా , వైట్ అండ్ వైట్ లో రాజకీయ నాయకునిగా , లవర్ బాయ్ గా ఇలా వివిధ గెటప్స్ లో ఇప్పటి వరకు మనకి పరిచయమవని కొత్త మేనరిజం తో కనపడతాయాడు . రొమాన్స్ కూడా అక్కడక్కడ మనం గమనించవచ్చు . శేఖర్ చంద్ర ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగ్గా టీజర్ కి అదనపు ఆకర్షణగా ఉంది మొత్తం మీద ఈ టీజర్ తో సినిమా పట్ల అంచనాలు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు .

2019 జనవరి లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని టీజర్ లో వెల్లడించారు .