దిశను మార్చుకుంది పెథాయ్

SMTV Desk 2018-12-18 11:06:16  CyclonePhethai,Phethai HELPLINE,#CyclonePhethai,amaravathi ,chandarababu naidu ,chennai, CBN ,TDP,

అమరావతి డిసెంబర్ 18 :చెన్నై, ఆంధ్రా ప్రజలను వణికించిన పెథాయి ముప్పునుండి సురక్షితంగా బయట పడ్డారు . భయానకమయిన ఈ తుఫాను పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించి , అధికారులను యుద్దప్రాతిపతిన సేవలందించడానికి సంసిధ్ధం చేసి , జరగకుండా ముందు జాగ్రత్తలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తుని సమర్ధవంతం గా ఎదుర్కొంది . " పెథాయ్ " తుఫాను తుని , యానాం, ఈ రెండు చోట్ల తీరం దాటాక అదృష్టం కొద్దీ క్రమక్రమం గా బలహీనపడి , దిశను మార్చుకుని వొరిస్సా వైపు గా పయనించింది . తీర ప్రాంతాలలో భారీ వర్షాలు పడ్డాయి, అక్కడక్కడా ఆస్థి నష్టం జరిగినా ,ఎక్కడా ప్రాణ నష్టం జరగని కారణంగా ప్రజలూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు .

కాగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో నేడు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు .