కళ్యాణ్ రామ్ '118' టీజర్

SMTV Desk 2018-12-18 10:40:11  kalyan ram, nandamuri, nkr, tdp, tollywood,118 teaser,patas

హైదరాబాద్ డిసెంబర్ 18 : నందమూరి కళ్యాణ్ రామ్ , కేవలం సినిమాల మీద అభిరుచితో జయాపజయాలు లెక్కచెయ్యకుండా స్వయం గా తానే నటిస్తూ , నిర్మిస్తూ కొత్త వాళ్ళని ప్రోత్సహించే హీరోల్లోవొకడు . పలు అపజయాల తరువాత "పటాస్" సినిమాతో మళ్ళీ గాడిలో పడినట్లు అనిపించినా "నా నువ్వే లాంటి" ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు , ఆ తరువాత వచ్చిన "ఎం యల్ ఏ " కొంత మేరకు పర్వాలేదనిపించింది .

తాజాగా ఈ నందమూరి వారసుడు ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో "118" సినిమా చేస్తున్నాడు , ఇప్పటికే ఆ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చెయ్యగా మంచి స్పందన వచ్చింది కాగా ఈ రోజు ఆ సినిమా టీజర్ ని విడుదల చేశారు . ఈ టీజర్ లో కళ్యాణ్ రామ్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది.