ఇది విచారణా లేక పబ్లిసిటీనా ? : రోజా

SMTV Desk 2017-07-26 15:11:03  roja about drugs case, mla roja, jabardast roja,

హైదరాబాద్, జూలై 26: వైకాపా ఎమ్మెల్యే రోజా డ్రగ్స్ విచారణపై చాలా తీవ్రంగా మండిపడ్డారు. సిట్ చేస్తున్నఈ విచారణ పబ్లిసిటీలా ఉందని, సినిమా వాళ్ల జీవితాలు అద్దాల మేడాల్లాంటివన్నారు. ఇటీవల సిట్ అధికారులు విచారించిన సినీ ప్రమఖులు నిర్దోషులని తేలితె వారు కోల్పోయిన జీవితాన్ని సిట్ అధికారులు తిరిగివ్వలేరన్నారు. రహస్య విచారణ జరిపి నేరస్తులను పట్టుకోవాలని, రాజకీయ పలుకుబడి ఉన్న నేరస్తులను శిక్షిస్తే మేము కూడా సహకరిస్తామని ఆమె స్పష్టం చేసారు. సిట్ దర్యాప్తు బృందం ఇప్పటికైనా ఇలాంటి పబ్లిసిటీ పనులు మానుకోవాలి అని ఆమె మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసారు.