64 అడుగుల శ్రీ మహావిష్ణువు భారీ విగ్రహం

SMTV Desk 2018-12-17 18:40:51  Big statue of sri maha vishnuvu, Tamilnadu, Tiruvannamali

తమిళనాడు, డిసెంబర్ 17: తిరువణ్ణామలైలో రెండేళ్లు కష్టపడి 64 అడుగులు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి ప్రాణం పోషారు శిల్పులు. ఈ విగ్రహం బరువు 300 టన్నుల పైనే ఉంటుందని తెలిపారు. ఈ అద్భుత విగ్రహం ఇప్పుడు అందర్ని ఆకట్టుకోంటోంది. బెంగళూరుకు చెందిన ఓ రిటైర్డ్ డాక్టర్ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు పూనుకుని... రెండేళ్ల క్రితం తిరువణ్ణామలైలోని శిల్పుల్ని సంప్రదించి... పని అప్పగించారు. ఇక అప్పటి నుంచి శిల్పులు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు పనిచేస్తూ మొత్తానికి పని పూర్తి చేశారు. కానీ, ఈ భారీ విగ్రహాన్ని తరలించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని... దీని కోసం 240 టైర్ల ట్రక్కును తెచ్చి.. మొత్తానికి ట్రక్‌పైకి చేర్చి... తిరువణ్ణామలై నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారు.