అంతరిక్షం అప్పుడే సీక్వలా???

SMTV Desk 2018-12-16 12:19:44  Antha Riksham, Varun Tej

హైదరాబాద్ , డిసెంబర్ 16: టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా అంతరిక్షం. ఘాజి సినిమా తర్వాత సంకల్ప్ రెడ్డి చేస్తున్న అంతరిక్షం మీద భారీ అంచనాలున్నాయి. టాలీవుడ్ లో మొదటి స్పేస్ కాన్సెప్ట్ మూవీగా వస్తున్న అంతరిక్షం కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు సినీ వర్గాలు . ట్రైలర్ చూస్తే తెలుగు సినిమా మరో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో అంతరిక్షం వస్తుందని చెప్పొచ్చు.

ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అవుతుండగా.. రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా డైరక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ సినిమా సీక్వల్ ప్లానింగ్ గురించి చెప్పాడు. అంతరిక్షం తర్వాత బాలీవుడ్ లో రెండు ప్రొడక్షన్ ఆఫర్స్ రాగా.. అవి లేటయితే మాత్రం అంతరిక్షం పార్ట్ 2 చేస్తానని అంటున్నాడు సంకల్ప్ రెడ్డి. ఈ సీక్వల్ లో ఇదే కాస్ట్ అండ్ క్రూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతరిక్షం రిజల్ట్ ను బట్టి ఈ సీక్వల్ ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.