10 జీబీ ర్యామ్ తో వన్ ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్.!

SMTV Desk 2018-12-15 18:35:12  One Plus New Mobile, One Plus 6T

హైదరాబాద్, డిసెంబర్ 15: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ల హవా ఎలా ఉందొ అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో వన్ ప్లస్ సంస్థ ఇప్పుడు మరో కొత్త ఫోన్ ని వినియోగదారులకి అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్ ప్లస్ 6 అవెంజర్ ఎడిషన్ ని విడుదల చేసిన సంగతి మనకి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా వన్ ప్లస్ 6టీ మెక్ లారెన్ ఎడిషన్ లో లభ్యం కానుంది. ఈ స్మార్ట్ ఫోన్లో 10 జీబీ ర్యామ్ ని ఏర్పాటు చేశారు. దీని ధర రూ.50999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ తో పాటు యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై పలు ఆఫర్లు కూడా ఉన్నాయి.

వన్ ప్లస్ 6టీ ప్రత్యేకతలు:

6.41" ఫుల్ హెచ్డీ డిస్ప్లే (1080 x 2340 పిక్సల్స్), స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టం, 10 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16/20 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ