ఇడియట్ అని గూగుల్ లో సెర్చ్ చేస్తే ట్రంప్ ఫోటో ఎందుకు వస్తుంది?

SMTV Desk 2018-12-15 18:12:20  Trump, Google Issue

హైదరాబాద్, డిసెంబర్ 15: గూగుల్ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు, సెర్చ్ ఇంజిన్స్ లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. గూగుల్ లో బగ్స్ కారణంగా వొక్కోసారి చిత్రవిచిత్రమైన ఫలితాలు వస్తుంటాయి. తాజాగా ఇప్పుడు గూగుల్ లో ఇడియట్ అని టైప్ చేస్తే ఓ ప్రముఖ వ్యక్తి ఫొటోలు దర్శనమిస్తున్నాయి, ఆయన ఎవరో కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ విషయంపై అమెరికా ప్రతినిధుల సభ గూగుల్ కు నోటీసులు జారీచేసింది, వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ హౌస్ జ్యుడీషియరీ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ..‘గూగుల్ లో ఇడియట్ అని టైప్ చేయగానే ట్రంప్ ఫొటోలు దర్శనమవుతున్నాయి. గూగుల్ రాజకీయ వివక్షత పాటిస్తోందా? ఇలా ఎందుకు జరుగుతుంది? అని ప్రశ్నించారు. దీంతో సుందర్ పిచాయ్ జవాబిస్తూ..మాములుగా గూగుల్ సెర్చ్ ఫలితాల్లో కంపెనీ కల్పించుకోదన్నారు. ఇంటర్నెట్ లో ఉండే వ్యాసాలు, కథనాలు, వీడియోలను విశ్లేషించిన మీదట గూగుల్ తనకు తానుగా ఈ ఫలితాలను అందిస్తుంది. అంతేతప్ప ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు అని స్పష్టం చేశారు. గతంలో భారత్ లో పప్పు అని గూగుల్ లో సెర్చ్ చేస్తే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఫొటోలు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.