సాయి పల్లవి ని తిట్టుకుంటారు : శర్వానంద్

SMTV Desk 2018-12-15 12:09:31  Padi Padi Leche Manasu, Sharwanand, Sai Pallavi, Hanu Raghavapudi

హైదరాబాద్ , డిసెంబర్ 15 : హనురాఘవపూడి దర్శకత్వం లో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం " పడి పడి లేచె మనసు ". ఈ నెల 21 న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ని నిన్న విడుదల చెయ్యగా మంచి స్పందన వస్తుంది .

తాజాగా శర్వానంద్ ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలు ప్రస్తావిస్తూ . "ప్రతి రోజు కొత్తగా ప్రేమించాలి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. అందుకే ఈ సినిమాకి హను రాఘవపూడి పడి పడి లేచె మనసు అని టైటిల్ పెట్టాడు. లవ్ లో వొకసారి పడేయడమే కష్టం ..అలాంటిది ఇందులో హీరోయిన్ ను పదే పదే లవ్ లో పడేయడానికి ఎన్ని పాట్లు పడ్డానో తెరపై చూస్తే తెలుస్తుంది.
ఈ సినిమా చూసేవాళ్లు సాయిపల్లవిని కోపగించుకుంటారు , నన్ను అయ్యో పాపం అంటారు. సూర్యలాంటి బాయ్ ఫ్రెండ్ వుంటే బాగుండునని అనుకుంటారు . ఈ సినిమాకి సంబంధించి నటన పరంగా నాకు .. సాయిపల్లవికి మంచి మార్కులు పడ్డాయంటే అందుకు హను రాఘవపూడినే కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.