చిరంజీవి @ నెంబర్ 1

SMTV Desk 2018-12-14 18:47:27  chiru,saira,google south,south trends,tollywood,nani,nandamuri balakrishna,jagapathibabu,nagashourya

హైదరాబాద్ , డిసెంబర్ 14 : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి తప్పుకుని సినిమాలు మళ్ళి మొదలెట్టాడు , తన 150వ చిత్రం తమిళ్ కత్తి కి రీమేక్ లో నటించి మెప్పించి ఐ యమ బ్యాక్ అన్నాడు . కాగా ప్రస్తుతం తనయుడు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ సురేంద్రరెడ్డి దర్శకత్వంలో సైరా సినిమాలో నటిస్తున్నాడు.



తాజా సమాచారం ప్రకారం గూగుల్ దక్షిణ భరతదేశం ట్రెండ్స్ ని విడుదల చేసింది మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు . చిరంజీవి తరువాత నాని, నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రష్మికా మండన్న, అనసుయ భరద్వాజ్,మోహన్ బాబు, జగపతి బాబు, నాగ శౌర్యలు ఈ క్రమంలో ఉన్నారు.