'96'కి హీరో ,హీరోయిన్లు ఫిక్స్ అయ్యారు

SMTV Desk 2018-12-14 18:11:26  trisha,96,sarwanad,dil raju,samantha

హైదరాబాద్ , డిసెంబర్ 14 : తమిళంలో విజయ్ సేతుపతి ... త్రిష జంటగా 2018 అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రేమకథాచిత్రం 96 అనే చిత్రం. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు . ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో దిల్ రాజు రైట్స్ తీసుకున్నారు.

ఈ సినిమాలో నటించనున్నట్టు కొంతమంది కథానాయకుల పేర్లు వినిపించాయిగానీ, చివరికి శర్వానంద్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక తమిళంలో త్రిష చేసిన పాత్ర కోసం సమంతను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం.నటనకు ఫీలింగ్స్ కి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే సినిమా ఇది , ప్రేమకథా చిత్రమే అయినా హీరో,హీరోయిన్ ని టచ్ చేయడం కూడా జరగదట. అందువల్లనే ఈ సినిమా చేయడానికి వెంటనే సమంత అంగీకరించిందని చెప్పుకుంటున్నారు. దర్శకుడు ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.