2.ఓ కలెక్షన్స్ 15 రోజులకి ?

SMTV Desk 2018-12-14 12:34:46  ROBO 2.0,SHAKAR,RAJINI KANTH,2.O COLLECTIONS,TAMIL,TELUGU,HINDI

చెన్నై , డిసెంబర్ 14: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి బలమైన కథాకథనాలను జోడించి రజినీకాంత్ హీరోగా , శంకర్ అందించిన చిత్రమే 2.ఓ . ప్రపంచవ్యాప్తంగా తెలుగు .. తమిళ .. హిందీ భాషలలో లో ఈ సినిమా విడుదలైంది. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకున్న ఈ సినిమా తొలిరోజు నుంచే విజయవిహారం చేయడం మొదలుపెట్టింది. అదే జోరును కొనసాగిస్తూ మూడు వెర్షన్స్ లోను 100 కోట్ల గ్రాస్ ను సాధించిన రికార్డును సొంతం చేసుకుంది.

తొలివారంలో 526.86 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన ఈ సినిమా, రెండవ వారం పూర్తయ్యేనాటికి 710.98 కోట్లను రాబట్టిందని తమిళ సినిమా ట్రేడ్ అనలిస్ట్ "మనోబాలా" తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వొక్క తమిళనాడులోనే రెండు వారాల్లో 166.98 కోట్లను రాబట్టి, రజనీకాంత్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా 2.ఓ నిలవడం విశేషంగా చెబుతున్నారు.