రాఫెల్ తీర్పు వచ్చేసింది

SMTV Desk 2018-12-14 11:44:42  RAFEL,AVIATION,MODI,BJP,CONGRESS ,SUPREME COURT,INDIA,RELAINCE,DASSUALT AVIATION

ఢిల్లీ , డిసెంబర్ 14:
సుప్రీం కోర్ట్ రాఫెల్ జెట్ వొప్పందంలో కోర్టు నుండి విచారణను కోరుతూ నాలుగు పిటిషన్లపై తీర్పును ప్రారంభించింది. దీని కింద ఫ్రెంచ్ రక్షణ తయారీదారు డస్సాల్ట్ ఏవియేషన్ నుండి 36 రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలను భారతదేశం కొనుగోలు చేస్తుంది. నవంబర్ 14 న జస్టిస్ రాజన్ గొగోయ్ ,జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, కెఎం జోసెఫ్లు ఈ తీర్పును వెల్లడించారు చేశారు. ఈ వొప్పందంపై దర్యాప్తు కోరుతూ నాలుగు పిటిషన్లు ప్రసంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, న్యాయవాదులు ఎం . ఎల్ . శర్మ మరియు వినీత్ ధండా , మరియు ఆమ్ ఆద్మీ పార్టీ , ఎం . పి . సంజయ్ సింగ్. నరేంద్రమోడీ ప్రభుత్వం రాఫెల్ వొప్పందంలో బంధు ప్రీతి మరియు అవినీతి ఆరోపణలతో ప్రతిపక్షం నిందించింది. మోడీ ప్రభుత్వం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు బదులుగా ఇది రెలైన్స్ సంస్థని భాగస్వామి చేసి , అట్టడుగు కంపెనీ అయిన డస్సల్ట్ ఏవియేషన్ను ఎంచుకోవడం తప్పని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం మరియు దశాల్ట్ ఏవియేషన్ ఈ ఆరోపణలను తిరస్కరించాయి.

బీజేపీ , జాతీయ భద్రత దృష్ట్యా అత్యవసరంగా చేసుకున్న వొప్పందంగా అభివర్ణించింది . అంతే కాకుండా ఇది గతంలో తీసుకున్న 126 విమానాల కోసం మునుపటి వొప్పందం రద్దును సమర్థించింది. ఈ వొప్పందం యొక్క ధర వివరాలను భద్రతా రీత్యా బహిరంగంగా బహిర్గతం చేయడానికి ప్రభుత్వం నిరాకరించిన తర్వాత సుప్రీంకోర్టు బెంచ్ పరిశీలన చేసింది. ఈ వొప్పందం సుమారు రూ. 58,000 కోట్లు ఉంటదని అంచనా వేసింది .

అభ్యర్ధనల పై విచారణ సమయంలో న్యాయస్థానం సీనియర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులతో సంప్రదింపులు జరిపి చేసింది భద్రతా రీత్యా ఇప్పుడున్న అవసరాల గురించి కూడా ప్రశ్నించింది. చర్చల అనంతరం " రాఫెల్ " వొప్పందాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది .

ఈ తీర్పుతో ఇప్పటి వరకూ ఈ వొప్పందానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రధానమంత్రి మోడీ కి వొకింత ఉపశమనం కలిగిందని భావించవచ్చు .