చంద్రబాబు మేనల్లుడు మృతి...!

SMTV Desk 2018-12-14 11:42:43  AP CM Chandrababu, son in law dies

హైదరాబాద్, డిసెంబర్ 14: ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మేనల్లుడు ఉదయ్‌ కుమార్‌ (43) ఈ ఉదయం కేర్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన నిన్న గుండెపోటుతో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు. చంద్రబాబు రెండో సోదరి హైమవతి కుమారుడు ఉదయ్ కుమార్. ఆయన మృతి వార్త తెలుసుకున్న చంద్రబాబు, అమరావతి నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.