జగన్ కు మేలు జరగాలన్న కేటీఆర్...!

SMTV Desk 2018-12-13 18:52:29  KTR, Jaganmohan Reddy, AP Politics

హైదరాబాద్, డిసెంబర్ 13: ఆంధ్రలో వచ్చే వేసవిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే విషయంలో తాము ఇంకా ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్న సమయంలో, వైసీపీకి మద్దతుపై కేటీఆర్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. తెరాస ఇంతవరకూ ప్రత్యేకించి ఏ వొక్క పార్టీకీ దగ్గర కాలేదని కేటీఆర్ చెప్పారు.

ఏపీలో వైసీపీ అధినేత జగన్ చాలా గట్టి పోటీని ఇస్తున్నారని, ఆయనకు మేలు జరగాలని ఆశిస్తున్నాను అని చెప్పారు. ప్రస్తుతానికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం, పాలనపై దృష్టిని సారించామని, తరువాత సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటామని కేటీఆర్ అన్నారు.