కెసిఆర్ బహుమతిపై కుతూహలంలో రోజా..!

SMTV Desk 2018-12-13 18:36:54  KCR, Roja, Chandrababu, Revanth Reddy

గుంటూరు, డిసెంబర్ 13: ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి తెలంగాణ తాజా సీఎం కేసీఆర్ ఇచ్చే బహుమతి ఏంటో చూడాలని తనకు ఎంతో కుతూహలంగా ఉందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. ఆమె గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి బాగా బుద్ధి చెప్పారని విమర్శించారు. తెలంగాణలో ప్రజలు చంద్రబాబును తరిమినట్టే, ఏపీలో కూడా తరిమేయనున్నారని రోజా అన్నారు.

రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజగోపాల్ ఏం ఉద్దేశించి తెలంగాణ నేతలతో చాటింగులు చేశారో చెప్పాలని, టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు కుదర్చాలని ఎందుకు మధ్యవర్తిత్వం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఆయన సర్వేలను ఇకపై ఎవరు నమ్మే పరిస్థితిల్లో లేరని చెప్పారు. చంద్రబాబుకు ఇచ్చే బహుమతి ఏదో కేసీఆర్ త్వరగా ఇవ్వాలని కోరారు.