'ఆత్మాభిమానం చచ్చిందా ?' గోరంట్ల ఫైర్

SMTV Desk 2018-12-13 17:35:26  buchayya chowdary,andhra,telangana,telanga elections,Kcr,Cbn,chandrababu naidu,JANSEENA,YSRCP,JAGAN,PAWAN KALYAN

అమరావతి, డిసెంబర్ 13 :
2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం మనకి తెల్సిసిందే . ఆ సమయం లో సీమాంధ్ర ప్రజలు ఉమ్మడిగా అభివృధి చేసుకున్న హైదరాబాద్ ని కోల్పోతున్నారని ,ఆ లోటుని భర్తీ చెయ్యడానికి కొన్ని ప్రాజెక్టులు , పరిశ్రమలతో సహా , ముఖ్యంగా ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. కాగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వొప్పందం చేస్కుని తీరా గెలిచాక మాట మార్చి కుదరదన్నారు . అయితే జులై నెలలో ఆంధ్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలని కలుపుకుని "అవిశ్వాస తీర్మానాన్ని " ప్రవేశ పెట్టగా . మొన్నటి వరకు కలిసున్న సాటి రాష్ట్రమయిన తెలంగాణ కెసిఆర్ ప్రభుత్వం ఆంధ్రాకి వ్యతిరేకం గా వ్యవహరించింది .

కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస పార్టీ మహాకూటమిగా వచ్చిన కాంగ్రెస్ ,టీడీపీ , తదితర పార్టీలు అతి ఘోరంగా ఓడిపోయాయి . అయితే ఇక్కడ గమనించవలసిన విషయం వొకటుంది అదేంటి అంటే తెరాస గెలుపుకి వైస్సార్సీపీ , జనసేన కార్యకర్తలు కృషి కూడా ఉందనడం కాదనలేని సత్యం . కాగా జనసేన , వైస్సార్సీపీ కార్యకర్తలు కెసిఆర్ విజయానికి ఆంధ్ర లో సంబరాలు జరిపారు. అయితే చంద్రబాబు నాయుడు మాదిరిగానే కెసిఆర్ కూడా ఆంధ్రాకి వచ్చి వైస్సార్సీపీ కీ ప్రచారం చేసి టీడీపీ ని చిత్తుచేసి చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని సవాళ్ళు విసిరారు .
ఈ మొత్తం విషయం పై సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ " మీకు అస్సలు సిగ్గూ ఎగ్గూ ఉందా ? " అంటూ అవిశ్వాసం అప్పుడు కెసిఆర్ వైఖరిని గుర్తుచేశారు. " మన ఆంధ్రావాళ్ళని కుక్కలూ , రామాయణం లో చచ్చిన రాక్షషులు మళ్ళి ఆంధ్రా వాళ్ళ లాగా పుట్టారు , అది ఇది అని ఇష్టమొచ్చినట్లు దూషించాడు", మీరు వాళ్ళ గెలుపుకి ఇక్కడ సంబరం చేస్తున్నారు , ఆత్మాభిమానం లేదా ? ఏం జాతి మీది , ఆంధ్రాలోనే పుట్టారా ? " అంటూ ఫైర్ అయ్యారు. చివరిగా కెసిఆర్ ని ఉద్దేశించి ఈ దేశంలో ఎవరు ఎక్కడికయినా వెళ్లొచ్చు వస్తే రండి, మిమ్మల్ని ఎవరూ అడ్డుకోరు , అంటూ స్వాగతం పలికారు .

ఇంత ఘాటు గా మాట్లాడిన మాటలకి ఇరు పార్టీల అధినేతలు ఎలా స్పందిస్తారో , కార్యకర్తలు వాళ్ళు చేసిన పనిని ఎలా సమర్దిమ్చుకుంటారో వేచి చూడాలి .