'యన్.టి.ఆర్'తో క్రిష్ సినిమా డీ

SMTV Desk 2018-12-13 16:30:52  nandamuri balakrishan,nani,krish,Ntr,Ntr biopic,telugu,tdp,nenu local,gamyam,kanche,jagaralamudi krish

హైదరాబాద్ డిసెంబర్ 13: వొక హీరో వి రెండులు సినిమాలు వొకే రోజు విడుదలవ్వడం మనం చూసాం . అప్పట్లో నందమూరి బాలకృష్ణ , ఈ మధ్య కాలంలో నాని వీరిద్దరికి ఆ అరుదైన రికార్డు ఉంది . కానీ వొకే డైరెక్టర్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు వొకే రోజు విడుదలవ్వడం మనం ఇప్పటి వరకు చూడలేదు కానీ అది అతి త్వరలో జరగనుంది . జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ ఈ సంక్రాంతికి ‘యన్.టి.ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న క్రిష్.. రెండో భాగాన్ని తొలి భాగం వచ్చిన రెండు వారాలకే విడుదల చెయ్యాలని అంటే జనవరి 24న మనముందుకు తీసుకొస్తున్నామని కూడా స్పష్టం చేశాడు. ఐతే అదే రోజుకు క్రిష్ డైరెక్ట్ చేసి మధ్యలో విరమించిన బాలీవుడ్ మూవీ ‘మణికర్ణిక చిత్రాన్ని కుడా ఆ రోజునే విడుదల కాబోతున్నట్లు ఇంతకుముందు వార్తలొచ్చాయి. క్రిష్ బయటికి వచ్చేయడం తో ఈ చిత్రానికి కొన్ని ఇబ్బందులు ఎదురైనాసరే అన్నింటినీ ఎదురొడ్డి సినిమాను పూర్తి చేసి జనవరి 25నే పక్కాగా సినిమాను వస్తోందని చేయబోతున్నట్లు చెబుతున్నారు. విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని హిందీతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తారట.

అంటే క్రిష్ సినిమా తో క్రిష్ సగం డైరెక్ట్ చేసిన సినిమా తలపడనుందా ? అనే ప్రశ్న ఈ విషయం తెలిసినోళ్లందరికి వస్తున్న డౌట్ . క్రిష్ మాత్రం ఇప్పుడు ‘యన్.టి.ఆర్ కథానాయకుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పర్యవేక్షిస్తూ రెండో భాగం షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆడియో విడుదల కూడా భారిగా నిమ్మకూరు లో ప్లాన్ చేశారు కనుక అన్ని వొకదాని వెనక వొకటి రావడం తో ప్రస్తుతానికి "యన్ .టి .ఆర్ " తో అంటిపెట్టుకుని ఉన్నాడు . "మణికర్ణిక " ప్రొమిషన్ లో పాల్గొంటాడో లేదు చూడలి .