సీఎంలుగా వాళ్ళే ఉండాలి అంటున్న హీరో.!

SMTV Desk 2018-12-13 12:17:39  Hero Suman, KCR, Chandrababu

తిరుమల, డిసెంబర్ 13: తెలంగాణలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో సినీ నటుడు హీరో సుమన్ మాట్లాడుతూ తెలంగాణాలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా ఉంటేనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిని సాధిస్తాయన్నారు. ప్రజలకు వారి వల్లే మంచి చేకూరుతుందన్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. తెలంగాణలో తాను అనుకున్నట్లుగానే తెరాస మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలుగు ప్రజలకు మేలు జరిగేలా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని కోరారు.