బీపీ తగ్గుముఖం పట్టాలంటే

SMTV Desk 2018-12-12 13:48:30  Blood pressure, BP, health

అరటిఆకులో భోజనం చేయటం అరటిపువ్వును కూరగా వండుకోవడం అరటిదుంప రసంతీసి 3 తులాలు ఉదయం సాయంత్రం తేనెతో తీసుకోవడం చేయండి.

మెంతి గింజలు నెరుగాగానీ మొలకలు వచ్చేవరకూ నానించి గాని మెత్తగా రుబ్బి 1 చెంచా ఎత్తున తీసుకోవటం మెంతికూరని వండుకోవడం చేయండి

పల్లెగింజలు మొక్కవ్రేళ్ళతో సహా కొండపిండి మొక్క ఆకులు వ్రేళ్ళతో సహా తీసుకోండి ఈ రెండు రోడ్డుపక్కన చెలగట్టవెంబడీ దొరికేవే . వీటిని శుభ్రంచేసి ,ఎండించి తేలికగా 2 చెంచాలు ఉదయం 2చెంచాలు సాయంత్రం కాషాయం కాచుకొని తాగాలి 2 గ్లాసులు నీళ్లు పోసి 1/2గ్లాసు మిగిలేలా మరిగించించాలి రక్తపోటు వ్యాధిలో శరీరంలో పట్టిన నీరు తగ్గుతుంది

సునాముఖి ఆకుచారు (రసం)కాచుకొని తాగండి. సుఖవిరేచనం అయి బీపీ తగ్గుతుంది

సుగంధిపాల వేళ్ళు పచారికోట్లలో దొరుకుతాయి కషాయం కాచుకొని తాగండి వేడి తగ్గుతుంది బీపీలో ఉద్రేకం తగ్గుతుంది
రెల్లు దర్భ తుంగ మొదలైన గడ్డిజాతి మొక్కలు వేళ్ళాను సేకరించి ఎండించి దంచి 2చెంచాలాపొడిని కషాయం కాచుకొని తేనేగాని పంచదారగాని వేసుకొని తాగండి చలవ చేస్తుంది ప్రశాంతంగా ఉంటుంది

వట్టివేళ్ళు కచ్చురాలు తుంగముస్తలు సుగంధిపాలవేళ్లు వీటిని పై వలెనే ఎండించి దంచి 2చెంచాలు పొడిని కషాయం కాచుకొని తాగండి ఇదికూడా చలవ చేసేదే బూడిద గుమ్మడితో వివిధపదార్ధాలు తయారుచేనుకోండి .


ఏలకులు లోపలిగింజల్ని నేరుగాగాని కషాయంగా గాని తీసుకుంటే బీపీ వ్యాధుల్లో ఉపద్రవాలు తగ్గుతాయి ఆకలి పుడుతుంది వాంతి తగ్గుతుంది మూత్రం చక్కగా నడుస్తుంది నేత్రాలు బాగుపడతాయి కడుపులో దోషాలు తగ్గుతాయి రక్తంలో ఉద్రేకం తగ్గుతుంది ఎక్కిళ్ళు తగ్గుతాయి చలవచేస్తుంది

కమలాఫలం లోపలిగింజల్ని నూరి అరటిపండులోనుగాని ఖాళీ క్యాప్సూల్స్లోగాని పెట్టుకొని తీసుకుంటే దాహం తాపం వేడి వాంతి పైత్యం తగ్గుతాయి గుండె బలంగా ఉంటుంది రక్తప్రసారం సక్రమంగా సాగుతుంది

కర్బుజపండు గింజల్ని సేకరించి ఎండించి నూరి లోపలి పప్పుని తీసుకొని వేరుశనగపప్పు బాదం పప్పులతో ఆహార పదార్ధాలు చేసుకున్నట్లే దీనితోను చేసుకొని తీసుకుంటే మూత్రం ఎక్కువగా నడుస్తుంది నీరు లాగేస్తుంది ధాతుపుష్టినిస్తుంది కడుపులోనొప్పి బాధలు తగ్గుతాయి వేడి తగ్గుతుంది

ధనియాలు నూరి కొద్దిగా నీరు పోస్తూ కషాయం తీసి పంచదార కలుపుకొని తాగితే చలవ తల తిరుగుడు అజీర్తి శ్లేష్మం కళ్ళు ఎర్రబడటం కడుపులో మంట తగ్గుతుంది

జీలకర్రను దోరగా వేయించి పెద్దనిమ్మపండు రసంలో నానబెట్టి తెల్లవారినైనా తర్వాత ఎండించి మల్లి నిమ్మపండు రసంలో నానించి మర్నాడు ఎండించి ఇలా ఏడుసార్లు భావన చేయాలి జీలకర్ర బాగా పులుపు పట్టేవరకూ ఇంకా వొకటి రెండు సార్లు ఈ వేదంగా చేసిన పర్లేదు దీన్ని భావన జీలకర్ర అంటారు ఇది తలతిప్పని అధిక నరక్తపోటుని సమస్త పైత్యవ్యాధుల్ని తగ్గుతుంది