'పెట్టా' టీజర్ అంచనాలకి మించి ఉంది

SMTV Desk 2018-12-12 13:01:28  rajini kanth,petta,karthik subbaraju,simran,trisha

చేనై,డిసెంబర్ 12 : కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా పెట్టా సినిమాను రూపొందుతోంది . ఈ రోజున రజనీకాంత్ పుట్టినరోజు కావడంతో, అభిమానులలో సంతోషాన్ని నింపడానికి పెట్టా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది .

పెట్టా టీమ్ రజనీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్లో రజనీ సంప్రదాయ దుస్తుల్లో , మోడ్రన్ డ్రెస్సుల్లో డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. యూత్ తో కలిసి ఆయన స్టెప్పులు వేయడం. అందరూ విందు చేస్తూ ఆయనను అభివాదం చేయడం వంటి దృశ్యాల తో ఈ టీజర్ ను కట్ చేశారు. మొత్తానికి టీజర్ అంచనాలకి అందకుండా ఉంది . ఈ సినిమాలో సిమ్రాన్, త్రిష కథానాయికలుగా కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.